ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీలో నటించిన ఏనుగుల నటన ఆస్కార్ స్థాయి వరకూ వెళ్ళింది. ఈ సినిమాలో ఇద్దరు దంపతులు, ఏనుగులు వీళ్ళే ఉంటారు. ఏనుగులు, మనుషుల మధ్య జరిగే చక్కని కథతో కట్టిపడేస్తారు. అంత అద్భుతంగా ఈ చిత్రంలోని ఏనుగులు, మనుషులు జీవించారు. అందుకే ఈ చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. అయితే ఇంతటి సక్సెస్ కి కారణమైన ఏనుగులు అదృశ్యమయ్యాయి.
ఒకే చోట 18 ఏనుగులు చనిపోయి, వాటి కళేబరాలు కనిపించిన ఘటన ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కలకలం సృష్టిస్తోంది. ఈ 18 ఏనుగుల అనుమానాస్పత మృతికి అసలు కారణాలేంటన్నది త్వరగా తేల్చాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ 18 ఏనుగుల డెత్ మిస్టరీని చేధించేందుకు అస్సాం ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నుంచి ఇంకా రిపోర్టు రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా కనిపించిన ఆధారాలను బట్టి ఆ ఏనుగులు […]