భారత స్టార్ స్ప్రింటర్, ఆసియా క్రీడల విజేత ద్యుతీ చంద్ డోపింగ్ టెస్ట్ లో దొరికిపోయింది. ద్యుతీకి నిర్వహించిన పరీక్షల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా ) ఆమెను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ప్రకటనలో తెలిపింది. ద్యుతీ శరీరంలో సార్స్ ఎస్-4 అండ్రయిన్, ఓ డెఫినిలాండ్రైన్, సార్స్మ్, మోటాబోలైట్ లాంటి నిషేధిత పదార్థాలు కనిపించాయని వాడా తెలిపింది. ఈ స్టెరాయిడ్లు శక్తి, సామర్థ్యాలు ఇస్తూ, పురుష హార్మోన్ […]
కామన్ వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ స్ప్రింటర్ ధనలక్ష్మి, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యబాబు డోప్ టెస్టులో పట్టుబడ్డారు. దీంతో వీరిద్దరు కామన్ వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నారు. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ బుధవారం నిర్వహించిన డోప్ టెస్టులో ధనలక్ష్మి నిషేధిత స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలింది. బర్మింగ్‌హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగష్టు 8 వరకు కామన్ వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. కామన్‌వెల్త్ క్రీడల్లో స్ప్రింటర్ ధనలక్ష్మి 100 మీటర్ల […]
ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒలింపిక్స్‌లో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో చాను సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో చైనా వెయిట్‌లిఫ్టర్ హు జిహుయి బంగారు పతకం గెలిచింది. అయితే, కొన్ని కారణాల వల్ల జిహుయిని ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా నిర్వహకులు ఆదేశించారు. ఆమెకు డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు యాంటీ డోపింగ్ అధికారులు […]