ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒలింపిక్స్‌లో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో చాను సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో చైనా వెయిట్‌లిఫ్టర్ హు జిహుయి బంగారు పతకం గెలిచింది. అయితే, కొన్ని కారణాల వల్ల జిహుయిని ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా నిర్వహకులు ఆదేశించారు. ఆమెకు డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు యాంటీ డోపింగ్ అధికారులు వెల్లడించారు. ఒకవేళ జిహుయి డోప్ పరీక్షలో విఫలమైతే రెండో స్థానంలో ఉన్న మీరాబాయి చానుకి గోల్డ్ మెడల్ దక్కుతుంది.
ఈవెంట్‌లో జిహుయి స్నాచ్‌లో 94 కిలోలు , క్లీన్ అండ్ జర్క్‌లో 116 కిలోలు ఎత్తి బంగారు పతకం కైవసం చేసుకోగా, చాను – స్నాచ్‌లో 87 కిలోలు , క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోల బరువు ఎత్తి రజతంతో సరిపెట్టుకుంది. ఇక ఇండోనేషియా వెయిట్‌లిఫ్టర్ విండీ కాంటికా మొత్తంగా 194 కిలోల బరువు ఎత్తి కాంస్యం తృప్తి చెందింది. ఇదిలా ఉంటే, మీరాబాయి ఇప్పటికే భారత్‌కు తిరుగు ప్రయాణమైంది. స్వదేశానికి ఫ్లైటెక్కే ముందు ఎయిర్‌పోర్ట్‌లో కోచ్‌తో దిగిన ఫొటోను ఆమె ట్విటర్‌లో షేర్ చేసింది. ఒకవేళ జిహుయిని డోప్ టెస్ట్‌లో విఫలమైతే మాత్రం రెండోస్థానంలో ఉన్న మీరాబాయికి ఆ గోల్డ్ మెడల్ దక్కుతుంది.
ఈ ఈవెంట్‌లో చాను మొత్తం 202 కేజీల బరువు ఎత్తగా హౌ 210 కేజీలు ఎత్తి గోల్డ్ గెలిచింది. ఇండోనేషియా వెయిట్‌లిఫ్టర్ ఐసా విండీ కాంటికా బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు రజత పకతం అందించిన మీరాబాయి చాను – దేశానికి తొలి బంగారు పతకం అందించిన వెయిట్ లిఫ్టర్‌గా రికార్డులకెక్క బోతోంది. కారణం ఫైనల్‌లో ఆమెను ఓడించిన చైనీస్ వెయిట్ లిఫ్టర్ ఝిహుయి హో డోపింగ్ టెస్టులో దొరికిపోయినట్టు తెలుస్తోంది.
ఫైనల్ జరిగిన రెండు రోజుల తర్వాత ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. డోపింగ్‌లో దొరికిపోవడంతో ఆమె నుంచి పసిడి పతకాన్ని ఉపసంహరించుకుని చానుకు ప్రదానం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇంతకుమించిన వివరాలు తెలియరాలేదు. చాను కనుక పసిడి పతకం అందుకుంటే రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణిగా చాను పేరు రికార్డులకెక్కుతుంది. ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.