బాల్యంలో ఉన్నప్పుడు చాలా మంది గాలిపటాలు ఎగురవేసి ఉంటారు. సంక్రాంతి పండుగప్పుడో, లేక వేరే ఇతర సందర్భాల్లో చిన్నపిల్లలు గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పెద్దవారు కూడా ఎగురవేస్తుంటారు. అయితే ఇదే గాలిపటాల కాన్సెప్ట్ తో కరెంటుని తయారు చేసేందుకు శాత్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇంకా దీనిపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఒక గాలిపటాన్ని ఎగురవేయడం ద్వారా 10 కుటుంబాలకు సరిపడా విద్యుత్ ను తయారు చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా అనేక నిర్ణయం తీసుకుంటున్నా.. ట్రాఫిక్ సమస్యతో వాహనదారులకు ఇబ్బందులతో పాటు వాయి కాలుష్యం కూడా అధికమవుతోంది. అయితే టర్కీ నగరం ఇస్తాంబుల్ ఓ టెక్నికల్ యూనివర్సిటీతో కలిసి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే వీళ్లు మాత్రం ఏకంగా మంచి ఐడియాకు పదునుపెట్టారు. అదేంటంటే? ట్రాఫిక్ తో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది కూడా చదవండి: […]