'బలగం' స్టోరీని టర్న్ చేసింది ఓ కాకి. ఇప్పుడు 'విరూపాక్ష'లో అలాంటి ఓ కాకి.. భయపెట్టి థ్రిల్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో కాకి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి ఈ కాకిగోల?
కాకిని ప్రేమించే వారికంటే అసహ్యించుకునే వారే ఈ సమాజంలో చాలా ఎక్కువ. కానీ, కొంతమంది కాకులతో కూడా చెలిమి చేస్తూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి వారు పిలిస్తే కాకులు ఎక్కడున్నా వచ్చేస్తాయి.
పక్షుల్లో కాకులకు ప్రత్యేక స్థానం ఉంది. మిగతా పక్షులతో పోలిస్తే వీటికి ఐకమత్యం ఎక్కువ. తమలో ఏదైనా ఒక్క కాకికి ఆపద వాటిల్లితే.. గుంపుగా వచ్చేస్తాయి. ఇక మన సమాజంలో కాకులు అనగానే అన్ని దుశ్శకునాలే గురించి చెప్పారు. మరణించిన వ్యక్తులకు పిండప్రదానం చేసే సమయంలో కాకుల కోసం ఎంతసేపైనా సరే నిరీక్షిస్తారు. ఇంత సడెన్ గా ఈ కాకుల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. ఓ చోట కాకులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటమే కాక మనుషులు […]