కాకిని ప్రేమించే వారికంటే అసహ్యించుకునే వారే ఈ సమాజంలో చాలా ఎక్కువ. కానీ, కొంతమంది కాకులతో కూడా చెలిమి చేస్తూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి వారు పిలిస్తే కాకులు ఎక్కడున్నా వచ్చేస్తాయి.
కాకులను అందరూ అసహ్యించుకుంటూ ఉంటారు. కాకుల్ని దరిద్రానికి ప్రతీకగా భావిస్తుంటారు. కాకి తాక కూడదని, ఇంట్లోకి రాకూడదని అంటూ ఉంటారు. వాటి రూపు, అరుపు కారణంగా అవి అందవిహీనమైన జీవులుగా మారిపోయాయి. జనం దీని కారణంగా కూడా వాటిని అసహ్యించుకుంటూ ఉన్నారు. అయితే, కాకులు మనం అసహ్యించుకునేంత చెడ్డవి కావు. అవి తమ తోటి కాకులతో ఎంతో చెలిమిగా ఉంటాయి. తోటి కాకులకు కష్టం వస్తే తల్లడిల్లిపోతాయి. ఆహారాన్ని కూడా కలిసి పంచుకుంటాయి. మనుషుల్లో లేని ఎన్నో మంచి గుణాలు కాకుల్లో ఉన్నాయి. అలాంటి కాకులతో చెలిమి చేసేందుకు కూడా కొంతమంది జనం ఉన్నారు. వారు వాటిని అసహ్యించుకోకుండా ఎంతో స్నేహంగా ఉంటారు. తిండి కూడా పెడుతూ ఉంటారు.
అలాంటి వారు పిలిస్తే.. ఎక్కడున్నా అవి గొంతు గుర్తుపట్టి వారి దగ్గరకు ఎగురుకుంటూ వస్తాయి. తాజాగా, ఓ కాకి మిత్రుడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి తన అరుపుతో పదుల సంఖ్యలో కాకుల్ని ఆహ్వానించాడు. వివరాల్లోకి వెళితే.. అక్కుబాయ్ అనే వ్యక్తికి కాకిలా అరవటం బాగా వచ్చు. అతడు అచ్చం కాకిలాగే అరిచేవాడు. కాకుల్ని ఎక్కడున్నా తన దగ్గరకు ఆహ్వానించేవాడు. ఓ రోజు అతడి స్నేహితులు అక్కుబాయ్ అద్భుత శక్తి గురించి ప్రపంచానికి చూపించాలనుకున్నారు. అతడ్ని ఓ గ్రౌండ్‌లోకి పిలిచి వీడియో తీయటం మొదలుపెట్టారు. ఆ సమయంలో అక్కడ ఒక్క కాకి కూడా లేదు. అతడు కాకిలా అరవటం మొదలుపెట్టగానే కాకులు పదుల సంఖ్యలో గ్రౌండ్‌లోకి వచ్చాయి. అతడి నైపుణ్యానికి గ్రామ ప్రజలతో పాటు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
crowman who can summon crows – bahot tejaswi log hai pic.twitter.com/LjhhamSMAg
— Best of the Best (@bestofallll) February 28, 2023