తన శవపేటికను తనే తయారు చేయించుకునే పరిస్థితి ఎవరికీ రాదు. అసలు అంత ధైర్యం కూడా ఉండదు. అలాంటిది ఖమ్మం యువకుడు హర్షవర్ధన్ ఎంత ధైర్యంగా శవపేటికను తయారు చేయించుకున్నాడో తలచుకుంటేనే ఏడుపొస్తుంది. అతని గురించి తన తండ్రి చెప్తుంటే ఇంత మంచోడా అని అనిపిస్తుంది. ఇంత మంచి మనిషికా చావు వచ్చింది అని అనిపిస్తుంది.
కొన్ని సార్లు మన చుట్టూ చోటు చేసుకునే సంఘటనల గురించి ఎంత ఆలోచించినా.. బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కావు. శాస్త్రీయంగా కూడా కారణాలు అంతుబట్టవు. ఇక అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు దేవుడి లీల అనుకోవడం తప్ప ఏం చేయలేం. ఈ తరహా సంఘటనల్లో జనాల్ని ఎక్కువ ఆశ్చర్యపరిచేది.. చనిపోయాడని భావించిన వ్యక్తి.. తిరిగి బతకడం. అదేంటో తెలియదు కానీ.. వైద్యులు పూర్తిగా అన్ని రకాలుగా పరీక్షలు చేసి.. మరణించాడు అని నిర్ధారించిన వ్యక్తులు.. అప్పుడప్పుడు […]