కొన్ని సార్లు మన చుట్టూ చోటు చేసుకునే సంఘటనల గురించి ఎంత ఆలోచించినా.. బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కావు. శాస్త్రీయంగా కూడా కారణాలు అంతుబట్టవు. ఇక అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు దేవుడి లీల అనుకోవడం తప్ప ఏం చేయలేం. ఈ తరహా సంఘటనల్లో జనాల్ని ఎక్కువ ఆశ్చర్యపరిచేది.. చనిపోయాడని భావించిన వ్యక్తి.. తిరిగి బతకడం. అదేంటో తెలియదు కానీ.. వైద్యులు పూర్తిగా అన్ని రకాలుగా పరీక్షలు చేసి.. మరణించాడు అని నిర్ధారించిన వ్యక్తులు.. అప్పుడప్పుడు సడెన్‌గా తిరిగి జీవిస్తారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పెరులో చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో చనిపోయిందని భావించిన మహిళను.. ఆమె బంధువులు శవపేటికలో పెట్టి.. పూడ్చి పెట్టడానికి తీసుకెళ్తుండగా.. ఉన్నట్లుండి ఆమె జీవించింది. ఆశ్చర్యపరిచే ఈ సంఘటన వివరాలు..
ఇది కూడా చదవండి: Video: జోరు వర్షంలో కారు ఆపిన డ్రైవర్.. ఒక్కసారిగా పిడుగు పడింది!
పెరూ దేశానికి చెందిన ‘రోసా ఇసాబెల్ సెస్పెడెస్ కలాకా’ ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. కలాకా మరణించింది అని ప్రకటించారు. ఆ కారు ప్రమాదంలో కలాకా ముగ్గురు మేనల్లుళ్లు తీవ్ర గాయాలపాలవగా, ఆమె బంధువు ఒకరు మృతి చెందాడు. 5, 11, 17 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు పరిస్థితి విషమించడంతో లంబాయేక్ ప్రాంతీయ ఆసుపత్రిలో ఐసీయూలో ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Youtuber Harsha Sai: వీడియో వైరల్! బార్బర్ ని మిలియనీర్‌గా మార్చిన యూట్యూబర్!
ఏప్రిల్ 25న చోటు చేసుకున్న ఈ ఘటనలో రోసా ఇసాబెల్ సెస్పెడెస్ కలాకా కూడా మృతి చెందిందని భావించిన బంధువులు ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ముందుగా అనుకున్న సమయానికి కాకుండా ఏప్రిల్ 26న రోసా కలాకా అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. అయితే రోసా మృతదేహాన్ని శవపేటికలో పెట్టి గొయ్యిలో దించబోతుండగా, శవపేటిక లోపలి నుండి శబ్దం రావడంతో.. ఆమె బంధువులు షాక్‌కు గురయ్యారు. వెంటనే శవపేటికను తెరిచి చూడగా చనిపోయిందని భావించన రోసా సజీవంగా కనిపించింది. దీంతో వెంటనే ఆమెను అలానే శవపేటికతో సహా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఆస్పత్రికి తరలించిన కొన్ని గంటల తరువాత రోసా మరణించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని రోసా బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Birthday party: పిచ్చికి పరాకాష్ఠ.. శృతిమించిన బర్త్ డే బంప్స్! వీడియో వైరల్..