తన శవపేటికను తనే తయారు చేయించుకునే పరిస్థితి ఎవరికీ రాదు. అసలు అంత ధైర్యం కూడా ఉండదు. అలాంటిది ఖమ్మం యువకుడు హర్షవర్ధన్ ఎంత ధైర్యంగా శవపేటికను తయారు చేయించుకున్నాడో తలచుకుంటేనే ఏడుపొస్తుంది. అతని గురించి తన తండ్రి చెప్తుంటే ఇంత మంచోడా అని అనిపిస్తుంది. ఇంత మంచి మనిషికా చావు వచ్చింది అని అనిపిస్తుంది.
రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారిన ఖమ్మం యువకుడు, డాక్టర్ హర్షవర్ధన్ గాథ ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది. చావు తేదీ ఫిక్స్ అయిపోయినా కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. చనిపోయే ముందు కూడా కుటుంబ సభ్యుల గురించే ఆలోచించాడు. అందరి జీవితాలను సెటిల్ చేసి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా తన భార్యకు విడాకులు ఇచ్చి.. ఆమె జీవితాన్ని సెటిల్ చేశాడు. ఇతను ఎంత మంచోడంటే తను చనిపోతే తనను ఆస్ట్రేలియా నుంచి భారత్ కి తీసుకురావడానికి స్నేహితులు ఇబ్బంది పడతారని అన్ని ఏర్పాట్లు తనే దగ్గరుండి చేసుకున్నాడు. తన చావు తర్వాత జరగాల్సిన ఏర్పాట్లు తనే పూర్తి చేసుకున్నాడు. చనిపోయిన తర్వాత నుంచి తన మృతదేహం ఇండియా చేరే వరకూ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.
అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది బాస్ నీకు? నీ కథ రాస్తుంటే ఏడుపొస్తుంది. వింటుంటే ఏడుపొస్తుంది. చదువుతుంటే ఏడుపొస్తుంది. కానీ ఇతను మాత్రం తన అంత చావు ముంచుకొస్తున్న సమయంలోనూ తన స్నేహితుల గురించి ఆలోచించాడు. మృతదేహాన్ని భారత్ కు తరలించడం కోసం అయ్యే ఖర్చు మొత్తం తన డబ్బే ఖర్చు పెట్టాడు. స్నేహితుల నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు. తాను చనిపోయాక స్నేహితులు ఇబ్బందులు పడతారేమో అని అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. రూ. 3 లక్షల 50 వేలు పెట్టి ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలో శవపేటికను ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నాడు. ‘ఒరేయ్.. నేను చనిపోయాక నన్ను ఈ బాక్సులో భారత్ కి తరలించండిరా’ అని స్నేహితులకు చెప్పాడు. ఇక తన మృతదేహం ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి రావడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా తనే స్వయంగా చేసుకున్నాడు.
అక్కడ లాయర్ తో మాట్లాడుకుని.. ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు పూర్తి చేసి చివరకు చనిపోయాక తన మృతదేహం ఇండియాకి వెళ్లేలా చేసుకున్నాడు. చనిపోయే ముందు అమ్మ, నాన్నలకు ఫోన్ చేశాడు. ‘నాన్న రెండు వారాలే బతుకుతానంట. మార్చి 27న నా డెత్ డేట్ అని వైద్యులు ఫిక్స్ చేశారు. నాన్న నేను ఉండను, మీరు జాగ్రత్త. మీకు ఏం చేయలేకపోతున్నాను. మిమ్మల్ని చూసుకోకుండా ముందే వెళ్ళిపోతున్నాను’ అంటూ ఏడ్చాడని హర్షవర్ధన్ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కొడుకు గురించి చెబుతుంటే వింటున్న మనకే కన్నీళ్లు వస్తాయి. చెట్టంత కొడుకు.. నీడలా ఉండాల్సిన మనిషి వదిలేసి వెళ్ళిపోతే ఏ తండ్రికైనా నరకంగానే ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒక మంచి మనిషిని పొట్టన బెట్టుకుంది. మరి స్నేహితులు ఇబ్బంది పడకూడదని.. తన డబ్బుతో స్వయంగా తన చావు తర్వాత జరగాల్సిన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.