మీ ఏటీఎం కార్డు పాడైపోయిందా? లేక ఎక్కడో పెట్టి మర్చిపోయారా? ఏటీఎంకి వస్తూ కార్డుని మర్చిపోయారా? అయితే టెన్షన్ పడకండి. ఏటీఎం కార్డు లేకున్నా కూడా ఏటీఎంలోంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అదెలాగో చూసేయండి.
ఈరోజుల్లో ‘బ్యాంకు’ అంటే తెలియని వారు ఎవరున్నారండి. డబ్బులు వేయాలన్నా.. తీయాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే కదా. టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈరోజుల్లో ఇంకా బ్యాంకుకు ఎవరెళ్తున్నారు అనే వారు కూడా ఉన్నారనుకోండి. ఉన్నారు.. మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ బ్యాంకుకు వెళ్లి ట్రాన్సక్షన్స్ చేస్తున్న వారున్నారు. కాకుంటే.. మారుతోన్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలోనూ మార్పలు వస్తున్నాయి. ఒకప్పుడు అకౌంట్లో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా బ్యాంకులకు వెళ్లి, క్యూలైన్లో నిల్చొని, రశీదు నింపి.. కౌంటర్ లో ఇస్తే.. అబ్బో.. […]