ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రధాన సమస్య గాలి కాలుష్యం. రాను రాను గాలిలో నాణ్యత అనేది తగ్గిపోతోంది. అత్యంత తక్కువ గాలి నాణ్యత కలిగిన నగాలు భారతదేశంలో 37 ఉన్నాయనే లెక్కలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు పలు విధానాలను కూడా వాడుతున్నారు.
ప్రపంచంలో ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. గ్లోబల్ వార్నింగ్ పై ఎన్ని రకాల చర్చలు నడుస్తున్నా.. ప్రజలు వాటిని పట్టించుకోకుండా తమ చుట్టూ వాతావరణాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు. భౌతిక, థర్మల్, జైవిక, రేడియోధార్మిక ధర్మాల్లో సంభవించే మార్పులు జీవుల ఆరోగ్యం, భద్రతకు హాని కలిగించే విధంగా ఉంటే దాన్ని కాలుష్యంగా పరిగణిస్తారు. ప్రస్తుత సమాజంలో వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యలకు కాలుష్యమే ప్రధానమైన కారణం. రోజురోజుకు వాతావరణ కాలుష్యం అధికమవుతోంది. నగరాల పరిస్థితి […]