'పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. పైకొచ్చినా..' తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి సక్సెస్ స్టోరీ ఇది. ఈ విషయం ఆయన ఎన్నోమార్లు.. ఎన్నో ప్రసంగాల్లో వినిపించారు. అయినప్పటికీ ఓ మహిళ.. ఆయనను ఇదే విషయం అడుగుతూ ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో ఆయన సదరు మహిళకు ఏమని సమాధానమిచ్చారో.. మీరూ చూడండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డికి చెందినదిగా భావిస్తున్న ఓ ఆడియో కలకలం రేపుతోంది. అమలాపురం మండలం ఈదరపల్లి వైకాపా MPTC అడపా సత్తిబాబును బెదిరించాడు. తమ ఇంటిని తగులబెడతారా అంటూ మంత్రి కుమారుడు అతణ్నీ తీవ్రస్థాయిలో దూషించాడు. అసభ్య పదజాలాన్ని కూడా వాడారు. రెండు కాళ్లు విరిచేస్తానని, అంతు చూస్తానంటూ ఎంపీటీసీని బండబూతులు తిడుతూ… బెదిరింపులకు దిగారు. ఇదంతా ఫోన్‌లోనే సాగింది. ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో బయటపడి వైరల్ […]