'పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. పైకొచ్చినా..' తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి సక్సెస్ స్టోరీ ఇది. ఈ విషయం ఆయన ఎన్నోమార్లు.. ఎన్నో ప్రసంగాల్లో వినిపించారు. అయినప్పటికీ ఓ మహిళ.. ఆయనను ఇదే విషయం అడుగుతూ ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో ఆయన సదరు మహిళకు ఏమని సమాధానమిచ్చారో.. మీరూ చూడండి.
ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్ లో ఉన్న మంత్రి ఎవరంటే.. అది చామకూర మల్లారెడ్డి. ఆయన ఇచ్చే ప్రసంగాలే ఆయనకు ఇంత పాపులారిటీ తీసుకొచ్చాయి. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చిన ఆయన.. తాను పడ్డ కష్టాల గురుంచి బహిరంగానే పలు మార్లు చెప్పుకొచ్చారు. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. కాలేజ్ పెట్టినా.. ఎంపీ అయినా.. ఎమ్మెల్యే అయినా.. కేసీఆర్ దయతో మంత్రి అయ్యా..’ గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన స్పీచ్ ఇది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ విదితమే.
ఇలా ఎక్కడికి వెళ్లినా తాను కష్టపడ్డ విధానం గురించి చెప్తూ తనదైన స్టైల్‌లో యువతను మోటివేట్ చేసే మంత్రి మల్లారెడ్డి, ఇటీవల ఓ సభలో తన ఎదుగుదల గురించి మరోమారు స్పీచ్ ఇచ్చారు. తన కష్టమే ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పారు.”రెండు పాల క్యాన్లు, ఓ సైకిల్‌తో మొదలు పెట్టిన తన ప్రయాణం.. ఈ రేంజ్‌కు చేరిందని.. ఇందంతా కష్టపడటం వల్లే జరిగిందని చెప్పారు. అంతేకాదు.. తన దగ్గర చాలా డబ్బు ఉందని.. ఎవరి డబ్బు తనకు అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు”. ఈ మాటలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ మాటలు విన్న ఓ మహిళ మంత్రి మల్లారెడ్డికి నేరుగా ఫోన్ చేసి.. మీరు అంత డబ్బు సంపాదించడానికి ఏం చేశారు? అందులో రహస్యం ఏమిటో తనకు చెప్పాలని కోరింది. అందుకు మంత్రిగారు ఎప్పటిలానే తనదైన స్టయిల్ లో సమాధానమిచ్చారు.
‘ఎప్పటిలాగే పాలమ్మినా, పూలమ్మినా.. కష్టపడ్డా.. అని చెప్పిన మల్లారెడ్డి, తమ కుటుంబానికి సరిపడా డబ్బులు తమ దగ్గర ఉన్నాయని.. ఎవరి డబ్బు తమకు వద్దంటూ సమాధానమిచ్చారు’. అంతటితో అగని సదరు మహిళ.. ‘తెలంగాణ ప్రజలంతా మీ పిల్లలు కాదా అంటూ మరోమారు ప్రశ్నించింది. అనంతరం పదే పదే.. ‘ఇంత డబ్బు సంపాదించేందుకు సీక్రెట్ ఏంటో చెప్పండి అని అడగగా.. మల్లారెడ్డి గతంలో నేను చెప్పిన వీడియోలు చూడలేదా అంటూ ప్రశ్నించారు. తాను ఎలా కష్టపడ్డానో ప్రతీ సారి చెప్తూనే వస్తున్నానని.. తన స్పీచ్ మొత్తం వినమని సలహా ఇచ్చి ఫోన్ కట్ చేశారు. అందుకు సంబంధించిన ఆడియో కాల్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. ఆ ఫోన్ చేసిన మహిళ మహిళ ఎవరు? ఎందుకలా ప్రశ్నించింది? అన్న వివరాలు తెలియరాలేదు. ఈ ఇరువురి సంభాషణపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.