కలకత్తాలో ప్లారా గ్లైడింగ్ శిక్షణలో భాగంగా ఇటీవల చందక గోవింద్ అనే తెలుగు జవాను మృతి చెందిన సంగతి విదితమే. అదేవిధంగా ఈ శిక్షణలో భాగంగా చాపర్స్ కూలి కొంత మంది జవాన్లు మరణించారు. తాజాగా జమ్ముకాశ్మీర్‌లో మరో విషాదం నెలకొంది.
ఈ మద్య కాలంలో ఆకాశ మార్గాన ప్రయాణాలు అంటే జనాలు భయపడిపోతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే ఆకాశంలో పలు విమానాలు, హెలికాప్టర్లు సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పైలెట్లు ప్రమాదాలను గమనించి అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు.
తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య, మరో 12 మంది ఆర్మీ అధికారులు చనిపోయారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వాసి సాయితేజ్ కూడా ఉన్నారు. సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు […]