కలకత్తాలో ప్లారా గ్లైడింగ్ శిక్షణలో భాగంగా ఇటీవల చందక గోవింద్ అనే తెలుగు జవాను మృతి చెందిన సంగతి విదితమే. అదేవిధంగా ఈ శిక్షణలో భాగంగా చాపర్స్ కూలి కొంత మంది జవాన్లు మరణించారు. తాజాగా జమ్ముకాశ్మీర్‌లో మరో విషాదం నెలకొంది.
దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్లు అటు యుద్ధాలన్నే కాదూ ప్రమాదాల్లో కూడా అశువులు బాస్తున్నారు. శిక్షణలో భాగంగా పలువురు జవాన్లు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. కలకత్తాలో ప్లారా గ్లైడింగ్ శిక్షణలో భాగంగా ఇటీవల చందక గోవింద్ అనే తెలుగు జవాను మృతి చెందిన సంగతి విదితమే. అదేవిధంగా ఈ శిక్షణలో భాగంగా చాపర్స్ కూలి కొంత మంది జవాన్లు మరణించారు. తాజాగా జమ్ముకాశ్మీర్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. కిష్టావర్ జిల్లాలోని మర్వా తహసీల్ పరిధి మచ్చన గ్రామంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ముగ్గురు అధికారులు ఉన్నట్లు సమాచారం.
మార్వా ప్రాంతంలోని నదిలో హెలికాప్టర్ శకలాలు గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్లకు గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.‘ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాఢ్ సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో చాపర్‌లో ముగ్గురు ఉన్నారు. వారు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’ అని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో ఇండియన్ ఆర్మీ, సహస్రబల్, పోలీసు దళం హుటాహుటిన వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
An Army ALH Dhruv Helicopter crashed near Kishtwar, Jammu & Kashmir. pic.twitter.com/6twRIaLuzI
— ANI (@ANI) May 4, 2023