సంక్రాంతి.. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లి సెటిల్ అయిన వారంతా ఈ ఒక్క పండగ కి మాత్రం తమ సొంత ఊరికి చేరుకుంటూ ఉంటారు. చుట్టాలు, స్నేహితులు మధ్య పండగ మూడు రోజులు ఆనందంగా గడపాలని తపిస్తూ ఉంటారు. ఇందుకే ఎంత కష్టం అయినా.. సంక్రాంతికి అందరూ కచ్చితంగా ప్రయాణాలు పెట్టుకుంటారు. అయితే.. ఇదే అదునుగా భావించే ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఈ గ్యాప్ లో దందాకి తెర లేపుతుంటాయి. […]
పండగలు వస్తే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ వారు దోపిడీకి పాల్పడతారు. అప్పటి వరకూ లేని టికెట్ ధరలు ఆ పండగ సీజన్ లో చూస్తారు. రద్దీ కారణంగా.. బస్సులు దొరకవన్న భయంతో ఎంత ధర ఉన్నా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుని సొంత ఊర్లు వెళ్తారు. పండగలు వచ్చాయంటే ప్రైవేట్ ట్రావెల్స్ వారి దోపిడీ రాజ్యం ఏలుతుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే సామాన్యుల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ వారే బాగా పండగ చేసుకుంటారు. ఇన్నాళ్లూ అడ్డు చెప్పేవాళ్లు […]