పండగలు వస్తే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ వారు దోపిడీకి పాల్పడతారు. అప్పటి వరకూ లేని టికెట్ ధరలు ఆ పండగ సీజన్ లో చూస్తారు. రద్దీ కారణంగా.. బస్సులు దొరకవన్న భయంతో ఎంత ధర ఉన్నా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుని సొంత ఊర్లు వెళ్తారు. పండగలు వచ్చాయంటే ప్రైవేట్ ట్రావెల్స్ వారి దోపిడీ రాజ్యం ఏలుతుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే సామాన్యుల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ వారే బాగా పండగ చేసుకుంటారు. ఇన్నాళ్లూ అడ్డు చెప్పేవాళ్లు లేక ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తూ సామాన్యుల పాలిట గుదిబండగా తయారయ్యారు. సామాన్యుల ఆవేదనను అర్థం చేసుకునే వాళ్ళు లేకుండా పోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ దోపిడీకి చెక్ పెట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి ఏపీ సర్కార్ అడ్డుకట్ట వేసింది.
గతంలో కూడా ఇలానే దోపిడీకి పాల్పడిన ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకున్న ఏపీ రవాణా శాఖ తాజాగా.. మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ఉక్కుపాదం మోపింది. సంక్రాంతి పండగకు ఊర్లు వెళ్లే ప్రయాణికుల దగ్గర రద్దీ పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేయాలని చూసే ప్రైవేట్ ట్రావెల్స్ కి ఏపీ రవాణా శాఖ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సంక్రాంతి రద్దీ పేరుతో ప్రయాణికులను దోపిడీ చేస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది. ఒకవేళ ఏ ప్రైవేట్ ట్రావెల్స్ వారైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయమని ఏపీ రవాణా శాఖ సూచిందింది. ప్రైవేట్ ట్రావెల్స్ పై దృష్టి పెట్టిన రవాణా శాఖ.. ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
సంక్రాంతి సీజన్ ముగిసేవరకూ 10 రోజుల పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు కొనసాగుతాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు జరుగుతాయని.. అలానే చెక్ పోస్టుల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అధిక ఛార్జీలు వసూలు చేయడమే కాకుండా.. ఫిట్ నెస్ సర్టిఫికెట్, ఇతర సర్టిఫికెట్లు లేకపోతే ఆ బస్సుని సీజ్ చేస్తామని తెలిపింది. అయితే గమ్య స్థానాన్ని చేరిన తర్వాత బస్సుని సీజ్ చేస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఆన్ లైన్ బుకింగ్ లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని, ఈ విషయంలో ప్రయాణికులు కూడా రవాణా శాఖకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
అలానే ఆర్టీసీ బస్టాండ్ ల దగ్గర ప్రైవేట్ బస్సులు ఆగినా, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను.. స్టేజ్ క్యారియర్ బస్సులుగా నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి మీరు సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? ఆన్ లైన్ లో గానీ, డైరెక్ట్ గా గానీ టికెట్లపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారా? అయితే రవాణా శాఖకు ఫిర్యాదు చేయండి. సామాన్యులను దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ కి ఒక్క ఫిర్యాదుతో చెక్ పెట్టండి. మరి పండగ పేరుతో ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా దోపిడీకి అడ్డుకట్ట వేసిన ఏపీ రవాణా శాఖపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. ప్రైవేట్ ట్రావెల్స్ వారు అధిక ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయచ్చు అనే విషయాన్ని వీలయినంత ఎక్కువమందికి షేర్ చేయండి. ఈ విషయం తెలియక డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి షేర్ చేయండి.