నేటికాలంలో ఏ శుభకార్యానికి వెళ్లినా విందు దగ్గరికి వచ్చేసరికి ఎవరికి వారు వడ్డించుకుని తినే పద్ధతినే కనిపిస్తోంది. కొందరు మాత్రం సంప్రదాయాన్ని గౌరవిస్తూ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇలా సహపంక్తి భోజనం కారణంగా బంధువుల మధ్య పిలుపులు, పరస్పరం మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఇలా మనుషుల్లో కనిపించే సహపంక్తి భోజనం మూగజీవాల కనిపిస్తే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన దృశ్యం తాజాగా ఆవిష్కృతమైంది.