నేటికాలంలో ఏ శుభకార్యానికి వెళ్లినా విందు దగ్గరికి వచ్చేసరికి ఎవరికి వారు వడ్డించుకుని తినే పద్ధతినే కనిపిస్తోంది. కొందరు మాత్రం సంప్రదాయాన్ని గౌరవిస్తూ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇలా సహపంక్తి భోజనం కారణంగా బంధువుల మధ్య పిలుపులు, పరస్పరం మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఇలా మనుషుల్లో కనిపించే సహపంక్తి భోజనం మూగజీవాల కనిపిస్తే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన దృశ్యం తాజాగా ఆవిష్కృతమైంది.
నేటికాలంలో ఏ శుభకార్యానికి వెళ్లినా విందు దగ్గరికి వచ్చేసరికి ఎవరికి వారు వడ్డించుకుని తినే పద్ధతినే కనిపిస్తోంది. కొందరు మాత్రం సంప్రదాయాన్ని గౌరవిస్తూ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇలా సహపంక్తి భోజనం కారణంగా బంధువుల మధ్య పిలుపులు, పరస్పరం మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఇలా మనుషుల్లో కనిపించే సహపంక్తి భోజనం మూగజీవాల కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇంకేముంది.. చూడటానికి రెండు కళ్లుకూడా చాలవు. అలాంటి అరుదైన దృశ్యం మహారాష్ట్రలోని ఓ ఆశ్రమంలో ఆవిష్కృతమైంది. కొండముచ్చులని కలసి ఎంతో ముచ్చటగా సహపంక్తి భోజనం చేస్తున్నాయి. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్రలోని అకోలా జిల్లా బాషిటేకడి తాలుకా కోతడి గ్రామంలో ముంగాసాజి మహారాజ్ అనే ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమానికి నిత్యం ఎంతో మంది వస్తుంటారు. అలానే ప్రత్యేక పర్వదినాల సందర్భంగా జనాల తాకిడి కాస్తా ఎక్కువగా ఉంటుంది. అలానే తరచూ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలానే గురువారం హనుమాన్ జయంతిని పురష్కరించుకుని ఈ ఆశ్రమంలో పూజలు ఘనంగా జరిగాయి. అలానే రాందాస్ సిందే మహారాజ్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలానే చుట్టుపక్కల ఉన్న కొండముచ్చులు ఆ భోజనాల వద్దకు వచ్చే ప్రయత్నం చేశాయి. కానీ అక్కడ ఉన్న కొందరు వాటిని దూరం తరిమే ప్రయత్నం చేశారు. అయితే ఆ కొండముచ్చులను గమనించిన స్వామిజీ.. వాటికి కూడా భోజనం ఏర్పాటు చేయాలని భక్తులకు సూచించారు. దీంతో గుంపులుగా వచ్చిన కొండముచ్చులకు ప్రత్యేకంగా భోజనం వడ్డించారు. సహపంక్తి భోజనం చేస్తున్న ఈ కొండముచ్చులు చూడముచ్చటగా ఉన్నాయి. శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొట్టింది. మరి.. ఈ దృశ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
अकोला : हनुमान जयंतीला चक्क वानरसेनेची पंगत, VIDEO पाहून तुम्हीही म्हणाल ‘हनुमान की जय’ pic.twitter.com/dCLV6V8hmX
— Renuka Dhaybar (@renu96dhaybar) April 7, 2023