పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ పాక్ సీనియర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రతిభ, ఎదుగుదలను చూసి మా సీనియర్లు ఓర్వలేరంటూ వివాదానికి తెరలేపాడు. ఇతరులు సక్సెస్ అయితే వారు సంతోషంగా ఉండలేరని చెప్పాడు. ఈ విషయం తాను ఇదివరకే చెప్పినా మళ్లీ చెబుతున్నానని తెలిపాడు. చాలా రోజులుగా జట్టులో చోటు కోల్పోయిన షెజాద్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్థాన్ క్రికెట్లో సీనియర్లు.. జూనియర్లకు, యంగ్ ప్లేయర్లకు ఎలాంటి సహకారం ఇవ్వకపోగా.. […]