Acham Naidu: ఏపీలో అధికార వైఎస్సార్ సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీడీపీ మరింత పగడ్బంధీగా సిద్ధమవుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రజల్లోకి వాయు వేగంతో దూసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులతో తనకు ప్రాణ హాని ఉందని లేఖలో పేర్కొన్నారు. […]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుని అర్ధరాత్రి నుండి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జె బ్రాండ్, కల్తీసారాలపై నిరసన తెలపకుండా అడ్డుకునేందుకు వారి ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు రాకుండా ముందస్తుగా […]