తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుని అర్ధరాత్రి నుండి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. జె బ్రాండ్, కల్తీసారాలపై నిరసన తెలపకుండా అడ్డుకునేందుకు వారి ఇంటి వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు రాకుండా ముందస్తుగా వారిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
విజయవాడలోని దేవినేని ఉమా మహేశ్వరరావు, బోండా ఉమ, గద్దె రామ్మోహన్ వంటి వారి ఇంటి వద్ద కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇటు విజయవాడు ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేతను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగా, పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తాను పార్టీ కార్యాలయానికి వెళ్తున్నానని చెప్పారు. ఏపీ ప్రజలు ప్రజాస్వామ్య పాలనలోనే ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నాయకులను వెంటనే విడిచిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది చదవండి: రజనీకాంత్ హీరోగా, కమల్ విలన్ గా రాజమౌళి మూవీ!
ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని, చర్చ జరపకుండా స్పీకర్ తమను సస్పెండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. కారణాలు చెప్పకుండా పోలీసులు ప్రజాప్రతినిధులను అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని చెప్పారు. పోలీసులు జగన్ రెడ్డికి తొత్తులుగా మారి అర్ధరాత్రి నుంచి ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి హౌస్ అరెస్టు చేశారని మండిపడ్డారు.