టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ప్రారంభించిన సీపీ సజ్జనార్ .

కరోనా కట్టడి కోసం సైబరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు.ఇప్పటికే ప్లాస్మా దానం చేయడంతో వేదిక ఏర్పాటు చేసిన సీపీ సజ్జనార్ తాజాగా ప్రముఖ ప్రవైట్ వైద్యుల చేత టెలి మెడిసిన్ కన్సల్టెన్సీని ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు నేరుగా నగర పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఈనేపథ్యంలోనే సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ తనవంతు సహాయంగా కరోనా రోగులకు సహయాన్నిఅందించే ప్రయత్నం చేశారు
కరోనా కారణంగా ఆందోళనతో బయటకు వెళ్లలేని వారు ఆసుపత్రికి వెళ్తే బెడ్లు లేని వారు ఇంట్లోనే బిక్కు బిక్కమంటు న్నారు. వారికి ధైర్యం కలిగించేందుకు సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ను ప్రారంభించారు. పలు ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన వైధ్యులతో కలిసి సజ్జనార్ ఈ కాల్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కాల్ సెంటర్ లో కరోనా బాధితులు ఫోన్ చేసి వైధ్యులను సంప్రదించవచ్చు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా అన్ని విషయాలను తెలియజేయవచ్చు.ఎస్సీఎస్సీ సెక్రటరీ జనరల్ కృష్ణ యోదులా మాట్లాడుతూ.. ఎవరైనా కరోనా లక్షణాలు ఉండి గానీ లేకుండా గానీ కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయితే అటువంటి వారు తమ టెలీ మెడిసిన్ కన్సల్టేషన్ కాల్ సెంటర్ +918045811138 కు కాల్ చేయాల్సిందిగా సూచించారు. అటువంటి వ్యక్తులకు కొవిడ్ లక్షణాలపై ఉచిత సలహాలు అందివ్వడంతో పాటు చికిత్స, పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో ప్రవేశం, వ్యాక్సినేషన్, జాగ్రత్తల్లో మార్గదర్శకత్వం చేయనున్నట్లు తెలిపారు. ఇదివరకే పోలీసు విభాగం నుండి ప్లాస్మా దానం కోసం ముందుకు వచ్చారు. కరోనా సోకిన వారి నుండి అవసరమైన కరోనా పేషంట్లకు ప్లాస్మా దానం చేసేందుకు వేదికను ఏర్పాటు చేశారు. దీని ద్వార అనేక మంది రోగులు బతికి బట్టకట్టారు.
ఎస్సీఎస్సీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ మీనన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొంటున్న కాంటినెంటల్ హాస్పిటల్స్, సన్షైన్ హాస్పిటల్స్, సిటిజెన్స్ హాస్పిటల్స్, మెడికోవర్ హాస్పిటల్స్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్, ఏఐజీ హాస్పిటల్స్ వైద్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here