మంద‌కృష్ణ‌ను ప‌రామ‌ర్శించిన ష‌ర్మిల‌.. దళిత భేరి సభకు ఆహ్వానం!

తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు.. ఏపి సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ‘వైఎస్సార్‌టీపీ’ని స్థాపించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు రావడమే తన లక్ష్యమని ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు తెలంగాణలో నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నారు.. ఉగ్యోగ నోటిఫికేషన్లు పడే వరకు తన పోరాటం ఆగదని చెబుతున్నారు.

sharmila minతాజాగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌ కృష్ణ మాదిగను వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల బుధవారం క‌లిశారు. మంద‌ కృష్ణ మాదిగ ఇటీవ‌ల‌ బాత్‌‌రూంలో కాలు జారి పడ‌డంతో బోన్‌‌ ఫ్రాక్చర్ అయిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న కొద్దిరోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నను వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల క‌లిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించాను. అలాగే, సెప్టెంబ‌రు 12న వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ తిరుమ‌ల‌గిరిలో నిర్వహించే “ద‌ళిత భేరి” బహిరంగ స‌భ‌కు ఆయ‌న‌ను తప్పకుండా రావాలని కోరినట్లు తెలిపారు.

ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆమె ఫొటో పోస్ట్ చేశారు. ‘‘ఎమ్మార్పీఎస్ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు మంద‌కృష్ణ మాదిగ గారిని ఈ రోజు తన‌ నివాసంలో కలిసి ప‌రామ‌ర్శించ‌డం జ‌రిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించాను. అలాగే సెప్టెంబరు 12న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమ‌ల‌గిరిలో నిర్వహించే ‘‘ద‌ళిత భేరి’’ బహిరంగ స‌భ‌కు ఆయన్ను ఆహ్వానించాను.’’ అని షర్మిల ట్వీట్ చేశారు.