విద్యార్థుల కోసం లేడీ టీచర్ ట్వీట్.. వెంట‌నే స్పందించిన సజ్జనార్

తెలంగాణలో చెందిన సమర్థవంతమైన ఐపీఎస్ అధికారుల్లో ఒకరిగా సజ్జనార్ కు ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన ఏ బాధ్యతలు చేపట్టినా ఆ వ్యవస్థలో తనదైన ముద్ర వేస్తారు. ప్రస్తుతం ఆయన టీఎస్ఆర్టీసీ ఎండీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటో టీఎస్ఆర్టీసీ ని గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్నారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడానికి.. ఎవరికి ఏ సమస్య ఉన్న వెంటనే తనకు ట్వీట్ చేస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలంటూ ఓ లేడీ టీచర్ కోరారు. ఆ సమస్యను సజ్జనార్ వెంటనే పరిష్కరించారు.

sags minవివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్ కు 200 మంది విద్యార్థులు వస్తుంటారు.  ఉదయం పూట స్కూల్ కు రావడానికి బస్సులు లేక వీరంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకే బస్సులో వందలాది మంది విద్యార్థులు ప్రయాణించాల్సి వస్తోంది. అసలే కరోనా సమయం.. ఇలాంటి సమయంలో విద్యార్థులు గుంపులుగా రావడంపై టీచర్ భారతి ఎంతో ఆవేదన పడ్డారు. రవాణా సౌకర్యం కల్పించాలంటూ కస్తూర్భా పాఠశాలలో పనిచేసే టీచర్ భారతి విద్యార్థులు పడుతున్న కష్టాలకు సంబంధించి ఓ వీడియో తీసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్విట్టర్ ద్వారా పంపించారు. విద్యార్థులకు బస్సు సౌకర్యాన్ని కల్పించి, వారి ఇబ్బందులను తొలగించాలని కోరారు.

rmg minలేడీ టీచర్ పంపించిన సమస్యపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించారు. తక్షణమే బస్సు సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో అదనపు బస్సును అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఉపాధ్యాయురాలు భార‌తి, కోట‌ప‌ల్లి మోడ‌ల్ స్కూల్ విద్యార్థులు సజ్జ‌నార్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.