బ్రేకింగ్ : ఎమ్మెల్యే సీతక్కకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

sethakka mulugumla congress

తెలంగాణ కాంగ్రెస్ నేత, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర అస్వస్థత కు గురైంది. గత కొంత కాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి తెలంగాణాలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆరేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన తర్వాత వారి కుటుంబ సభ్యులను ముందుగా పరామర్శించారు ఎమ్మెల్యే సీతక్క. ప్రతిపక్ష హోదాలో ఉన్న ఆమె సమయం చిక్కినప్పుడల్లా అధికార పక్ష నేతలను ఎండగడుతున్నారు.

seetakka minతాజాగా దళిత గిరిజన దండోరా ర్యాలీ లో భాగంగా… ఆమె ఏటూరునాగారంలో పర్యటించారు. ఈ క్రమంలో ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కళ్లు తిరిగి కింద పడిపోయారు.. వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క ఏటూరు నాగారం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.  ఇక ఎమ్మెల్యే సీతక్క ఆరోగ్యంపై తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం అందుతోంది. కాగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజాప్రతినిధులతో పాటు సీతక్క అభిమానులు, కార్యకర్తలు డాక్టర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.