కళ్ళ ముందే వాగులో కొట్టుకుపోయిన తల్లీకొడుకులు!

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడడం ఈ వర్షాలకు ఊతమిచ్చింది. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఏకధాటిగా కురిసిన వానకు జనజీవనం స్తంభించి పోయింది. మరో రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి.

vagbag minఇటీవల కురిసిన వర్షాలకు ఉత్తరాంధ్రలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాల తాకిడికి చనిపోయారు. విశాఖ మన్యంలోని పెదబయలు మండలం చీకుపనస గెడ్డలో తల్లీ కొడుకు కళ్ల ముందే కొట్టుకు పోవడం షాక్ కి గురి చేసింది. చీకటపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ (35), ప్రశాంత్(6).

vaagg min

అయితే దారుణమైన విషయం ఏంటేంటే అక్కడ కొంత మంది వర్షానికి తడుస్తూ ఉన్నారు.. వారి కళ్ల ముందే తల్లీ కొడుకులు కొట్టుకు పోతున్నా రక్షించలేని పరిస్థితిలో ఉన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అందరూ చూస్తుండగానే కళ్ల ముందు తల్లీ కొడుకు ప్రవాహంలో కొట్టుకు పోవడం హృదయాలను కలచి వేస్తుంది.