చంద్రబాబుకు కరోనాపై సీఎం జగన్ ట్వీట్!

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా మరోసారి పంజా విసురుతుంది. ఇప్పటికే విపరీతంగా కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ సెలబ్రెటీలు కరోనా భారిన పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కరోనా భారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. చంద్రబాబు కరోనా బారిన పడిన విషయం బయటకి వచ్చాక.. పార్టీలకి అతీతంగా నేతలంతా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు ఆరోగ్యంపై స్పందించారు.

dgag compressedచంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేయడం విశేషం. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా రాజకీయం వేడెక్కింది. నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం మీడియా ముందే బాధపడిన సందర్భాలు ఉన్నాయి. దీంతో.. రాష్ట్ర రాజకీయం గాడి తప్పిందా అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ.., ఇప్పుడు సీఎం జగన్ ఆ విషయాలు అన్నీ మరచి.. చంద్రబాబు క్షేమాన్ని కోరుకుంటూ ట్వీట్ చేయడం అన్నీ విధాలుగా శుభ పరిణామం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.