డెలివరికి ముందు కరోనా వచ్చింది పాపకు పాలివ్వడానికి కూడా లేదు

ఫిల్మ్ డెస్క్- తాను కరోనా బారినపడ్డానని ప్రముఖ బుల్లితెర యాంకర్, సినిమా నటి హరితేజ చెప్పింది. ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె తాజాగా ఇన్స్టా వేదికగా ఓ భావోద్వేగ వీడియోని షేర్ చేసింది. డెలివరీ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అభిమానులతో చాలా విషయాలు చెప్పుకొచ్చింది హరితేజ. డెలివరీకి కొన్నిరోజుల ముందు ఇంటిల్లిపాదికి కరోనా సోకడంతో తాను ఎంతో బాధపడ్డానని ఆమె అంది. డెలివరీకి సరిగ్గా వారం రోజుల ముందు ఆస్పత్రికి వెళ్లాను.. వైద్యులు పరీక్షలు చేసి బేబీ ఆరోగ్యంగా ఉందని.. సాధారణ డెలివరీ అవుతుందని చెప్పారు.. నాకెంతో సంతోషంగా అనిపించింది.. బేబీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో అనుకోనివిధంగా మా కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. ఏం చేయాలో అర్థం కాలేదు… సర్జరీ అనంతరం పాప పుట్టింది.. పాపకు కొవిడ్ పరీక్ష చేయగా నెగటివ్గా నిర్ధారణ అయ్యింది.. దాంతో పుట్టిన వెంటనే బేబీని నాకు దూరంగా ఉంచారు.. రోజూ వీడియో కాల్స్ చేసి బేబీని చూసేదాన్ని.. పాపకు పాలు ఇవ్వడానికి కూడా లేదు.. నాకెంతో బాధగా అనిపించేది… దేవుడు దయ వల్ల మా ఇంట్లో వారందరికీ నెగటివ్ వచ్చింది.. అని హరితేజ ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యింది. అంతేకాదు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసి కూడా కొంతమంది ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఆవేధన వ్యక్తం చేసింది. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హరితేజ సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here