కరోనా కేసుల్లో తగ్గుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు పర్యాటకానికి గేట్లు తెరిచాయి. లాక్డౌన్తో ఇళ్లకే పరిమితమైన యాత్రికులు ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటక ప్రదేశాలకు పోటెత్తుతున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామంటోంది. కరోనా ప్రారంభమైనప్పటినుంచి గజగజలాడుతున్న మహారాష్ట్ర తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్తో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా డెల్టాప్లస్ కేసులు 66 నమోదయ్యాయి. నిన్నటివరకు 65 కేసులుండగా, థానేలో మరో కేసు వెలుగచూసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కాంటాక్ట్, ట్రేసింగ్ చేస్తూ వైరస్ కట్టిడికి కృషిచేస్తోంది.కొంతకాలంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ డెల్టాప్లస్ పెరుగుతుండటంపై ప్రభుత్వం కలవరపాటుకు గురవుతోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ తో ఐదుగురు మృతిచెందినట్లు అధికారిక సమాచారం. డెల్టా ప్లస్ వేరియంట్ తో మూడు మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం ముంబైలో నగరంలో కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ తో 63 ఏళ్ల మహిళ మరణించగా రాయగడ్ జిల్లాలో 69 ఏళ్ల వ్యక్తి మరణించాడు. వీరిలో రత్నగిరి జిల్లాకు చెందినవారు ఇద్దరుండగా, ముంబయి, బీడ్, రాయగడ్ కి చెందినవారు ఒక్కరొక్కరు చొప్పున ఉన్నారు.
కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల టీకా తీసుకున్నవారినే రాష్ట్రంలోకి ఇకనుంచి అనుమతించనుంది. ఇందుకు సంబంధించి వారు టీకా తీసుకున్నట్లుగా సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. టీకా వేయించుకోనివారు రావాలంటే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పాటించనివారిని 14 రోజులపాటు క్వారంటైన్ కి పంపిస్తున్నారు. ఒక్క ముంబై నగరంలోని 11 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి.