టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా. మొదట్లో దేశవాళి క్రికెట్‌లో తన సత్తాను చాటి ఆయన మెల్లమెల్లగా దూసుకెళ్తూ టీమిండియాలో చేరిపోయాడు. ఇక 2018 టెస్ట్ క్రికెట్‌తో బౌలర్‌గా అరంగేట్రం చేశాడు బూమ్రా. తన పవర్ ఫుల్ బౌలింగ్‌తో బ్యాట్‌మెన్‌లకు చుక్కలు చూపిస్తున్నాడు. టీమిండియాలో బూమ్రా ప్రస్తుతం టీమ్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. తనదైన స్టైల్‌లో జెట్ స్పీడ్‌తో అదరగొడుతున్నాడు ఈ యంగ్ ప్లేయర్.
ఇక తన బౌలింగ్ పవర్‌తో ప్రత్యర్థుల వికెట్లు ఒక్కొక్కటిగా కుప్పకూల్చుతు బ్యాట్‌మెన్‌లను పెవీలియన్ బాట పట్టిస్తాడు. అటు ఐపీఎల్‌లోనూ తన సత్తాను చాటుతున్నాడు ఈ రైట్ హ్యాండ్ బౌలర్. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉన్న బుమ్రా తన బౌలింగ్ పవర్‌తో జట్టులో కీలక ఆటగాడిగా పేరు నమోదు చేసుకుంటున్నాడు. ఇక విషయమేంటంటే..టీమిండియా ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆగస్టు 4న తొలి టెస్ట్ ఆడనుంది. దీంతో భారత ఆటగాళ్లు ప్రాక్టిస్ సేషన్‌ను మొదలు పెట్టారు.
ఇక ఇందులో బూమ్రా తన కాళ్లకు బ్యాటింగ్ ఫ్యాడ్ల్‌ను కట్టుకుని బౌలింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఏంటీ బుమ్రా కొత్త ప్రయోగానికి ఏమైన ట్రై చేస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో బాగా వైరల్‌గా మారింది.