హైదరాబాద్ బోరబండ స్మశాన వాటికలో రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున అభిమానులు జనం వచ్చారు. రాకేష్ మాస్టర్ కుమారుడు అంత్యక్రియలు నిర్వహించాడు.
ప్రముఖ తెలుగు చలన చిత్ర నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బోరబండ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ తండ్రి చివరి కర్మలను పూర్తి చేశారు. అంత్యక్రియల్లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రాకేష్ మాస్టర్ భౌతిక దేహాన్ని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు.. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు మోశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, శేఖర్ మాస్టర్.. రాకేష్ మాస్టర్ శిష్యుడన్న సంగతి తెలిసిందే. అయితే, గత కొన్నేళ్ల నుంచి వీరిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి.
రాకేష్ మాస్టర్.. శేఖర్ మాస్టర్‌పై మీడియా వేదికగా దారుణమైన విమర్శలు చేశారు. ఆయన్ని పచ్చి బూతులు తిట్టారు. ఈ నేపథ్యంలోనే రాకేష్ మాస్టర్ కడచూపు కోసం శేఖర్ మాస్టర్ వస్తారా? రారా? అన్న నెలకొని ఉండింది. అయితే, తనకు విద్యను నేర్పిన గురువు కోసం శేఖర్ మాస్టర్ ఈగోను పక్కన పెట్టి వచ్చారు. రావటమే కాదు.. రాకేష్ మాస్టర్ అంత్యక్రియల్ని దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఇక, రాకేష్ మాస్టర్ గత రెండు,మూడు రోజులనుంచి రక్త విరేచనాలతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన పరిస్థితి ఆదివారం క్షీణించింది.
దీంతో ఆయన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయిన్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఆదివారం సాయంత్రం సమయంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృత్యువాతపడ్డారు. మరి, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు.. రాకేష్ మాస్టర్ భౌతిక దేహాన్ని మోయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.