కొందరు హీరోయిన్స్ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ చేసే రచ్చ మామూలుగా ఉండదు. మత్తెక్కించే అందాలతో కాక పుట్టిస్తూ హల్ చల్ చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ సీక్రెట్ ప్లేస్ లో టాటూ వేయించుకున్న ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది.
సినిమా అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతారు కొందరు హీరోయిన్స్. హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో పోస్టులుపెడుతూ.. ట్రెండ్ అవుతూ ఉంటారు. తాజాగా ఇదే కోవలోకి చేరింది మలయాళి భామ ‘గౌరీ జీ కిషన్’. తమిళంలో వచ్చిన 96 మూవీ చూసే ఉంటారు. ఆది తెలుగులో జానుగా రీమేక్ చేశారు. తమిళంలో హిట్ అవ్వగా తెలుగులో అవరేజ్‌గా అడింది. కాగా ఆ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్స్ చిన్నప్పటి పాత్రలో నటించింది. ఆ తర్వాత మాస్టర్, కర్ణన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇందులో హీరోగా సంతోష్ శోభన్ నటించాడు. మెగా స్టార్ చిరంజీవి కూతురు ఈ సినిమాను నిర్మించింది. కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా గౌరీ జీ కిషన్ ఎవరికీ కనిపించని ప్లేస్ లో టాటూ వేసుకోని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవానికి ఆమె టాటూ వేసుకున్న సంగతి ఎవరికీ తెలియదు. తనే స్వయంగా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ.. దీన్నీ‘రిబ్ టాటూ అంటారని కామెంట్ చేసింది. సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూ వచ్చిన ఈ మలయాళీ భామ ఏ పాత్ర చేయడానికైనా వెనుకాడను అని చెప్పకనే చెప్తు ఇలా సోషల్ మీడియాలో ప్రైవేట్ పార్టులు కనపడేలా పోస్టులు పెట్టడంతో నువ్వు కూడా ఇలా చేస్తున్నావా.. ఛీ.. అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అవకాశాల కోసం అడ్డమైన దారులు తొక్కుతారు అని అంటున్నారు మరి కొందరు నెటిజన్లు. ప్రైవేట్ ప్లేసులో టాటూలు వేసుకుని ఇలా సిగ్గు లేకుండా వాటిని సోషల్ మీడియాలో పెట్టడం అవసరమా అని కొందరు ఫైర్ అవుతున్నారు. సినిమా అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా, ఇలాంటి పోస్టులు పెడితేనే అవకాశాలు వస్తాయా, కొంచెం అయిన కామన్ సెన్స్ ఉండాలి అని ఆమెను మెన్షన్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సినిమాల్లో అవకాశాల కోసం కొంతమంది హీరోయిన్స్ హాట్ పోజులతో గ్లామర్ షో చేస్తూ ఆ ఫొటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వైరల్ అవుతుంటారు.