సినీ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న దర్శకుడి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది.
చిత్ర పరిశ్రమలో గుండెపోటు కలకలం రేపుతోంది. పౌష్టికాహారం తీసుకుంటూ, నిత్యం వ్యాయామాలు చేసే వారు గుండెపోటుకు గురవుతున్నారు. ఇప్పటికే సినిమా రంగానికి చెందిన వారు గుండెపోటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు సంబవిస్తూ కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్నవారు గుండెపోటుతో ఆకస్మికంగా మరణిస్తున్నారు. కాగా తాజాగా ఓ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డైరెక్టర్ గుండెపోటుకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సిద్దిఖీ ఈ రోజు గుండెపోటుకు గురయ్యారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే కొచ్చిలోని హాస్పిటల్ కు తరలించారు. అక్కడి వైద్యులు డైరెక్టర్ సిద్దిఖీకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇదివరకే సిద్ధిఖీ న్యుమోనియా మరియు కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. దీనికి చికిత్స కొనసాగుతుండగానే చిత్ర దర్శకుడు సిద్ధిఖీ గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.
కాగా డైరెక్టర్ సిద్దిఖీ 1989లో ‘రామ్‌జీ రావు స్పీకింగ్’ అనే మలయాళ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సిద్ధిక్. 1986లో ‘పప్పన్ ప్రియాపెట్టా పప్పన్’ అనే మలయాళ చిత్రంతో స్క్రీన్ రైటర్‌గా అరంగేట్రం చేశాడు. ఇక తెలుగులోను నితిన్ హీరోగా ‘మారో’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతను బిగ్‌స్క్రీన్‌పై వచ్చిన చివరి చిత్రం ‘బిగ్ బ్రదర్’. డైరెక్టర్ సిద్ధిఖీ హిందీ, తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో సినిమాలు తీశారు.