ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం మరణించిన సంగతి తెలిసిందే. పోస్ట్ కోవిడ్ అనారోగ్యం కారణంగా ఆయన గత కొద్దిరోజుల నుంచి ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించడంతో మృత్యువాతపడ్డారు. విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. ఇక ఇది మరువకముందే తాజాగా అస్సామీ ప్రముఖ నటుడు కిశోర్ దాస్ మరణించాడు.
ఇది కూడా చదవండి: Meena: భర్త అంత్యక్రియల్ని అన్నీ తానై జరిపిన మీనా!..
గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన శనివారం కన్నుమూశారు. కిశోర్ దాస్ అస్సామీలో 300కి పైగా మ్యూజిక్ వీడియోలలో నటించిన మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో ప్రధానంగా అస్సామీ వినోద పరిశ్రమలో పనిచేసిన దాస్, గౌహతి ప్రాంతీయ వినోద ఛానెల్‌లలో ప్రసారమయ్యే బిధాత, బంధున్, నెదేఖా ఫగన్ లో నటించడమే కాకుండా ప్రముఖ అస్సామీ టెలివిజన్ షోలలో కూడా పని చేశాడు. 30 ఏళ్ల వయసులోనే కిశోర్ దాస్ మరణించడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిశోర్ దాస్ మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.