హీరో అడివి శేష్ మొదటి నుంచీ విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్‌కి తగిన పాత్రలను మాత్రమే చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘గూఢచారి’గా మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు కథానాయకుడు అడివి శేష్. ఈనెలలోనే ‘గూఢచారి-2’ కి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకోనున్నట్లు ట్విటర్ వేదికగా తెలియజేశాడు.
శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కి విజయవంతమైన చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రం విడుదలై మూడేళ్లు పూర్తయ్యాయి. అనుక్షణం ఉద్వేగం ఉత్కంఠతో నడిచే ఈ సినిమాలో అడివి శేష్ జోడిగా శోభితా ధూళిపాళ్ల అలరించింది. కీలకమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు మెప్పించారు.
కథాకథనాలు, టేకింగ్ పరంగా గూఢచారి సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్ర సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని చిత్ర బృందం పంచుకుంది. త్వరలో అతను మరో పెద్ద మిషన్‌తో తిరిగి రానున్నాడు. ఈ సీక్వెల్‌కి ఆయనే స్వయంగా స్క్రిప్ట్ అందించనున్నారు. ఇప్పుడీ సీక్వెల్‌ను రాహుల్ పాకాల తెరకెక్కించనున్నారు.
అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాపై అడివి శేష్ ‘గూఢచారి-2’పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది’ అని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ‘మేజర్’ తరువాత అడివి శేష్ చేయబోయే సినిమా ‘గూఢచారి’ సీక్వెల్ అని అర్ధమవుతోంది.
It’s #3YearsforGoodachari today 🙂
My most loved film.
It is especially The film children love the most.
Since August has always been a lucky month for me, a huge update of the next mission later this month!#G2
Announcement coming soon! pic.twitter.com/nD5RtlE7iw
— Adivi Sesh (@AdiviSesh) August 3, 2021