దేశంలో కామాంధుల అరాచకాలు ఎక్కువయిపోతున్నాయి. చిన్నా,పెద్ద తేడాలేకుండా ఆడ వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. వావివరుసలు మరచి శరీర సుఖం కోసం దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ మారు తండ్రి కూతురు వరుసయ్యే యువతిపై కన్నేశాడు. చివరికి ఆ యువతిపై లైంగిక దాడి చేశాడు. దీంతో గర్భదాల్చిన ఆయువతికి అబార్షన్ చేయించే సరికి ఆరోగ్యపరిస్థితి విషమించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట్ లో ఓ మహిళ తన కూతురితో కలిసి జీవనం సాగిస్తుంది. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్త మరణించాడు. దీంతో కొన్నాళ్ల స్థానికంగా ఉంటే ఓ వ్యక్తి పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తితో పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో సదరు మహిళ కూతురిపై ఆ దుర్మార్గుడి కన్న పడింది. దీంతో కుమార్తెను లోబర్చుకుని బాలికపై మారు తండ్రి పలుమార్లు ఆత్యాచారానికి పాల్పడ్డాడు.
చివరకు బాలిక గర్భవతి కావడంతో ఆమెకు RMP ద్వారా నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు. కొన్ని రోజులకు బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక విషయం తెలుసుకున్న తల్లి దుండిగల్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరి ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.