తొమ్మిది నెలలు మోసి పెంచి పెద్ద చేసి తమ కొడుకు పెద్ద ప్రయోజకుడు కావాలని ప్రతీ తల్లీదండ్రుల భావిస్తారు. అలా పెంచి పెద్ద చేసినా తల్లిదండ్రులనే వృద్దాశ్రయంలో పంపించటం లేదంటే నడి రోడ్డుపై వదిలేయటం జరుగుతున్నాయి. తాజాగా ఓ వృద్ధుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నడి రోడ్డుపై పడేసిన ఘటనే యాదాద్రి జిల్లాలోని అడ్డగూడురు మండలం కాంచనపల్లిలో చోటు చేసుకుంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పండుటాకుల లాంటి బతికున్న వృద్ధుడిని చాపపుట్టి చెట్ట పొదల్లో వదిలేసి వెళ్లారు. […]