ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమాల కేసులో సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసుకు సంబంధించి ఇవాళ ఆమెకు విముక్తి లభించింది. ఆమె కేసుని కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై మోపిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ […]