ఇటీవల చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా థియేట్రికల్ రిలీజ్ తర్వాత తక్కువ టైంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. సినిమాలు ఓటిటిలోకి వచ్చాక ఆదరించేవారి సంఖ్య రోజురోజుకూ పెడుతోంది. ఈ క్రమంలో థియేటర్స్ లో చిన్న సినిమాగా రిలీజై.. పెద్ద విజయాన్ని అందుకున్న 'రైటర్ పద్మభూషణ్' మొత్తానికి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.
గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో చిన్ని సినిమాల హవా కొనసాగుతుంది. గత ఏడాది టాలీవుడ్ కి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. చిన్న సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్లు కూడా బాగానే రాబట్టాయి. ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించి హీరోలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో సుహాన్ ఒకరు. సందీప్ రాజ్ దర్శకత్వంలో ‘కలర్ ఫోటో’ చిత్రంతో ఈ యంగ్ హీరో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం […]