గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో చిన్ని సినిమాల హవా కొనసాగుతుంది. గత ఏడాది టాలీవుడ్ కి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. చిన్న సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్లు కూడా బాగానే రాబట్టాయి. ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించి హీరోలుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో సుహాన్ ఒకరు. సందీప్ రాజ్ దర్శకత్వంలో ‘కలర్ ఫోటో’ చిత్రంతో ఈ యంగ్ హీరో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో సుహాన్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు రాబడుతుంది.
సాధారణంగా చిన్న సినిమాలు స్టార్ హీరోలు చూసి ప్రశంసిస్తే.. ఆ చిత్ర బృందం ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు హీరో సుహాన్. గత శుక్రవారం ప్రశాంత్ షణ్ముఖ్ దర్శకత్వంలో అనురాగ్‌మై రెడ్డి నిర్మించిన ‘రైటర్ పద్మభూషణ్’ రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో హీరోగా సుహాన్ నటించాడు. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుండి మంచి కలెక్షన్లు రాబడుతుంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
‘ఈ మూవీ చూస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేశాను. రైటర్ పద్మభూషణ్ క్లయిమాక్స్ చాలా అద్భుతం అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది.. డైరెక్టర్ ప్రశాంత్ షణ్ముఖ్, ప్రొడ్యూసర్ అనురాగ్‌మై రెడ్డితో పాటు చిత్ర యూనిట్ కి నా అభినందనలు’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఇప్పటికే యూఎస్‌లో రెండు లక్షల డాలర్‌లు వసూలు చేసింది. ‘రైటర్ పద్మభూషణ్’ ఎలాంటి భారీ అంచనాలు లేకుండా రిలీజ్ అయి.. కేవలం మౌత్ టాక్ తో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీతో సుహాన్ కి మంచి భవిష్యత్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
Enjoyed watching #WriterPadmabhushan! A heartwarming film, especially the climax! ❤️ A must-watch for families! Loved @ActorSuhas‘ performance in the film!
Congratulations @SharathWhat, @anuragmayreddy, @prasanthshanmuk & the entire team on its huge success 👍👍👍 pic.twitter.com/yCg2MEKpiY
— Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2023