ఫ్రెంచ్ ఓపెన్‌లో ఊహించని పరిణామం. . టైటిల్ ఫేవరెట్, ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి నవోమి ఒసాకా టోర్నీ నుంచి తప్పుకొంది. టోర్నీకి ముందు మీడియాను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన ఈ జపాన్ స్టార్ ఇప్పుడు ఏకంగా ఈవెంట్‌కే దూరమై అందరినీ షాక్‌కు గురిచేసింది. కొన్నాళ్లుగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నానని, కొద్దిరోజులు ఆటకు విరామం ఇవ్వాలనుకుంటున్నందున టోర్నీలో ఆడాలనుకోవడం లేదని సోషల్ మీడియాలో ప్రకటించింది. సింగిల్స్ తొలిరౌండ్ గెలిచిన 23 ఏళ్ల ఒసాక రెండోరౌండ్ […]