న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. వెస్టిండీస్ జట్టు అద్భుత ప్రదర్శన ముందు ఇంగ్లాండ్ తలవంచక తప్పలేదు. బుధవారం డునెడిన్ లోని యూనివర్సిటీ ఓవల్ వేదికగా జరిగిన ఏడో గ్రూప్ మ్యాచులో విండీస్ మహిళల జట్టు.. ఇంగ్లాండ్ పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచులో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడినా.. విజయం మాత్రం విండీస్ […]