టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి దారుణమైన బ్యాడ్‌టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. మంచి నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీల మీద సెంచరీలు బాదిన కోహ్లీ.. ప్రస్తుతం పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. టన్నుల కొద్ది రన్స్ కొట్టి టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించిన వాడే ఇప్పుడు జట్టుకు భారంగా మారాడు. బ్యాటింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. అయినా కూడా కోహ్లీ దిగ్గజ ఆటగాడని అతని అభిమానులు, కొంతమంది మాజీ క్రికెటర్లు మద్దతు పలుకుతూ.. […]