గత కొన్ని నెలలుగా పలు అంశాలపై కేంద్రం, ట్విటర్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కొత్త నిబంధనలను పాటించాలంటూ కేంద్రం జూన్ నెల మొదటివారంలో ట్విటర్‌కు తుది నోటీసు జారీ చేసింది. ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర ప్రముఖుల వ్యక్తిగత ఖాతాల నుంచి వెరిఫికేషన్ మార్క్ ‘బ్లూ టిక్’ తొలగించిన ట్విటర్ విమర్శలు ఎదుర్కొంది. కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు మరో నోటీసు […]