కరోనా వేళ ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాపారం అద్బుతంగా సాగుతోంది. కరోనా వచ్చి భయాందోళనలకు గురవుతున్న వారంతా ప్రైవేట్ ఆస్పత్రులకే పరుగెత్తుతున్నారు. దేశం మొత్తం విూద ఇదే పరిస్థితి నెలకొంది. ప్రాణభయంతో డబ్బు ఉన్నా లేకున్నా, అప్పు చేసి లేదా ఉన్న నగలు అమ్ముకుని ఆస్పత్రులకు పరుగెత్తుతున్నారు. చస్తామో బతుకుతామో తెలియని పరిస్థితిలో కరోనా భయంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిఫారసు చేయించుకుని బెడ్డు కోసం నానాయాతన పడుతున్న దృశ్యాలు ఇప్పుడు దేశంలో కోకొల్లలు. కరోనా సోకి దిక్కుతోచక నిస్సహాయ […]