దేశంలో కరోనా ఎఫెక్ట్ ఎంత ఘోరంగా పడిందో ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. చాలా మంది నిరుద్యోగులు ఫుడ్ డెలివరీ వైపు ఎక్కువ శాతం దృష్టి సారించారు. కొన్ని సంస్థలు ఫుడ్ డెలివరీ కోసం తమ కంపెనీకి సంబంధించిన వాహనాలు ఇస్తారు.. మరికొంత మంది తమ సొంత వాహనాల ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తూ వస్తున్నారు. మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని విజయ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఔదార్యాన్ని చాటుకున్నారు. […]