దేశంలో కరోనా ఎఫెక్ట్ ఎంత ఘోరంగా పడిందో ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. చాలా మంది నిరుద్యోగులు ఫుడ్ డెలివరీ వైపు ఎక్కువ శాతం దృష్టి సారించారు. కొన్ని సంస్థలు ఫుడ్ డెలివరీ కోసం తమ కంపెనీకి సంబంధించిన వాహనాలు ఇస్తారు.. మరికొంత మంది తమ సొంత వాహనాల ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తూ వస్తున్నారు. మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని విజయ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఔదార్యాన్ని చాటుకున్నారు. ఒక ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి ఆర్ధిక కష్టాలు దూరం చేస్తూ ద్విచక్ర వాహనం డబ్బులు సమకూర్చారు.
కరోనా తర్వాత ఎంతో మంది యువకులు ఉద్యోగాలు పోగొట్టుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇండోర్‌లో ఓ యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. తనకు బైక్ కొనే స్థోమత లేక సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇండోర్‌లోని విజయ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తాము పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఆ యువకుడు సైకిల్ పై ఫుడ్ డెలివరీ చేస్తూ ఇబ్బంది పడటం గమనించినట్లు ఎస్హెచ్ఓ తెహజీబ్ తెలిపారు.
ఆర్ధికంగా ఆ యువకుడు ఎదగాలని.. తాము ఈ పని చేశామని అన్నారు. ఒకవేళ ఆ యువకుడి కి ఏదైనా కష్టం వచ్చి నెలవారి కిస్తీలు చెల్లించటంలో ఇబ్బందులు పడితే ఆదుకుంటామని ఎస్హెచ్ఓ తెహజీబ్ తెలిపారు. పోలీసుల అంటే కఠినంగా ఉంటారు అనుకునేవారు.. వారి ఔదార్యం చూసి ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.