ఈ మధ్యకాలంలో ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేవారు చాలా తక్కువగా ఉన్నారు. విలువలతో, మానవతా దృక్పథంతో మెలిగేవారు కరువయ్యారు. అలాంటిది ఓ ఊరిలో ఆచారాలకు, సాంప్రదాయాలను గౌవరవిస్తున్నారు. మనకు ప్రాథమిక అవసరాలతో పాటు కాళ్ళకు చెప్పులు కూడా చాలా అవసరం . అయితే ‘వేమన ఇండ్లు’ అనే గ్రామంలో ఏకంగా ఊరంతా చెప్పులు లేకుండా ఆచార, సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు.