ప్రముఖ సింగర్ వైశాలి బల్సారా కారులో అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో కారులో వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉంది. పార్ నది ఒడ్డున చాలా సేపు ఆ కారు అలానే ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారుని తనిఖీ చేశారు. లాక్ అయిన కారు డోర్ ఓపెన్ చేసి చూడగా వెనుక సీట్లో వైశాలి మృతదేహం పడి ఉంది. […]